సాలగ్రామాలు
హిందూ దేవాలయాలలో ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తి ప్రతిరూపంగా పూజింపబడే ఒక రకమైన నల్లని రాళ్ళని సాలిగ్రామాలు/సాలగ్రామాలు అంటారు. ఇవి నేపాల్ లోని గండకీ నది పరీవాహక ప్రాంతమైన 'సాలిగ్రామం' అనే గ్రామం లో విరివిగా లభిస్తాయి. ఈ రాళ్ళు మృదువుగా అక్కడక్కడా కొన్ని గుర్తులతో అండాకారం లో ఉంటాయి. ఆ గుర్తులు విష్ణువు యొక్క ఆయుధాలని చెప్పబడే శంఖం,చక్రం, గదలను మరియు విష్ణువు అవతారాలైన మత్స్య,కూర్మావతారాలను తలపించే విధంగా ఉండటం వలన ఆ రాళ్ళకు దివ్య శక్తులున్నట్లు ప్రజలు విశ్వసిస్తారు. జియాలజీ పరంగా వాటిని 65 మిలియన్ సంవత్సరాల క్రితం (క్రెటేషియస్ శకం) అంతరించిపోయిన 'అమ్మో నైట్స్స్ ' అనే సముద్ర జీవజాతుల శిలాజ అవశేషాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. డైనొసార్లు అంతరించింది కూడా ఈ కాలంలోనే. ఆ ప్రదేశం వద్ద రెండు భూభాగాలను వేరు చేస్తూ మద్యలో 'తెథిస్' అనే సముద్రం ఉండేది. క్రమంగా ఆ భూభాగాలు రెండు దగ్గరికి జరిగి బలంగా ఢీకొని సముద్రపు నేల బయటకు చొచ్చుకువచ్చి నేటి హిమాలయాలుగా రూపాంతరం చెందాయి. ఈ సంఘటన వల్ల అక్కడ ఉన్న సముద్రం మొత్తం కప్పబడి, అందులో ఉన్న జీవజాతులన్నీ నేలలోకి...