బెంగాల్ బేసిన్లో మొదలైన చమురు ఉత్పత్తి
బెంగాల్ బేసిన్లో మొదలైన చమురు ఉత్పత్తి ఓఎన్జీసీ క్రితం ఆదివారం బెంగాల్ బేసిన్లో మొదటిసారిగా చమురు ఉత్పత్తి ప్రారంభించింది. కేంద్ర చమురు, సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో అసోకనగర్ -1 బావి నుండి చమురు ఉత్పత్తి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మన దేశంలోని చమురు, సహజ వాయువులు ఉత్పత్తి చేసే బేసిన్లలో బెంగాల్ బేసిన్ ఎనిమిదవదిగా నిలిచింది. https://www.google.com/amp/s/www.aninews.in/news/business/dharmendra-pradhan-dedicates-bengal-basin-to-nation-says-discovery-would-aid-indias-energy-security20201222145853%3famp=1 ముంబై ఆఫ్ షోర్, క్యాంబే, కృష్ణ -గోదావరి, రాజస్థాన్, అస్సాం-అరకన్, అస్సాం షెల్ఫ్, కావేరి బేసిన్లు ఇప్పటివరకు హైడ్రో కర్బన నిక్షేపాలను ఉత్పత్తి చేస్తుండగా, కొత్తగా బెంగాల్ బేసిన్ కూడా ఆ జాబితాలో చేరింది. శాస్త్రవేత్తల, ఇంజనీర్ల డెబ్భై ఏళ్ల కృషికి ఫలితంగా చమురు దిగుమతులను తగ్గించి, దేశ శక్తి భద్రతను కాపాడటంలో బెంగాల్ బేసిన్ కీలక పాత్ర పోషించనుంది. ఈ బేసిన్ యొక్క ఉత్పత్తి అంచనాలు పూర్తిగా బహిర్గతం కాకపోయినా, ఉత్పత్తి మాత్రం లాభదాయకమే...