కొన్ని సముద్రతీరాల్లో (బీచ్‌ల్లో) నల్లటి ఇసుక ఉంటుంది. ఎందుకు?
సాధారణంగా పెద్ద తుఫాన్లు సంభవించిన తరువాత లేదా సముద్రపు అలలు ఉధృతి ఎక్కువగా ఉన్న రోజుల్లో తీరం వెంబడి ఇసుక దట్టంగా నల్లని పొర లాగ పేరుకుపోయి ఉంటుంది.
చిత్రం: India to reopen mining for rare-earth elements | MRS Bulletin | Cambridge Core
చిత్రం: Heavy mineral sand
ఈ నల్లని ఇసుక రేణువులు మామూలు ఇసుక రేణువుల కన్నా పరిమాణంలో చిన్నవిగా మరియు ఎక్కువ సాంద్రతను(>2.9g/cc) కలిగి ఉంటాయి. సముద్రం లోతున ఉండే ఇలమనైట్, గార్నెట్, టార్మలీన్, హార్న్ బ్లెండ్, సిలమనైట్, మోనోజైట్, రుటైల్ లాంటి భారీ ఖనిజ పదార్ధాలు(Heavy minerals)[1]తీరానికి కొట్టుకు రావడమే దీనికి కారణం.
ఇసుక తో పోల్చుకుంటే సాంద్రత ఎక్కువగా ఉండటం చేత వీటి కదలికలకి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అందువల్ల కేవలం పెద్ద కెరటాలు లేదా ప్రవాహాల కారణంగా మాత్రమే తీరానికి కొట్టుకువచ్చి మెరుస్తూ మామూలు ఇసుక మధ్యలో నల్లని పొరలు లాగ ఏర్పడతాయి. ఈ ఇసుకని చేతులో పట్టుకుని చూస్తే భారంగా ఉంటుంది.
పరిశ్రమల్లో ఈ ఖనిజాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సముద్ర కాలుష్యం ద్వారా ఇవి ఏర్పడవు.
చిత్రం: MRG Metals picks up high potential heavy mineral sands projects in Mozambique
చిత్రం: Heavy mineral sand
మన దేశంలో కేరళ[2], శ్రీకాకుళం-విశాఖపట్నం[3] తీరాల్లో ఈ నిక్షేపాలు కనిపిస్తాయి.
పొరలుగా కాకుండా పూర్తిగా నల్లని ఇసుకతో నిండిపోయిన తీరాలు కూడా ఉన్నాయి. ఈ ఇసుక అగ్ని పర్వతాల దగ్గరలోని రాళ్లు విచ్చిన్నం అవ్వడం ద్వారా తయారవుతుంది. The 15 Best Black Sand Beaches in the World
చిత్రం: https://travel.usnews.com/gallery/the-14-most-exotic-black-sand-beaches-in-the-world
ఫుట్‌నోట్స్
Comments
Post a Comment