Posts

భారత దేశానికి ఉత్తరాన హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి?

Image
మూడు వందల మిలియన్ ఏళ్ల క్రిందటి మాట..! అంటే 30కోట్ల సంవత్సరాల క్రితం… అనగనగా ఒక పేద్ద కుటుంబం. ఆ కుటుంబం ఎంతో కలిసి మెలసి సంతోషంగా జీవిస్తుండేవారు. ఎప్పుడూ ఒకర్నొకరు గట్టిగా హత్తుకునేంత గాఢమైన ప్రేమ వారి మధ్య ఉండేది. మరి అంత సంతోషంగా జీవిస్తున్న కుటుంబం అంటే విలన్లకి కళ్ళు కుడతాయి కదా.. ఈ విలన్ బాగా శక్తిమంతుడు. ఆ మాటలూ, ఈ మాటలూ చెప్పి కుటుంబం మధ్య చిచ్చు పెట్టాడు. ఫలితంగా కుటుంబం రెండు కింద చీలిపోయింది. అంతటితో ఆగకుండా విలన్ మళ్లీ ఆ రెండు కుటుంబాల్లో విడిగా దూరి ఒకరంటే ఒకరికి పడనీకుండా చేసాడు. ఈ రెండు కుటుంబాలూ అప్పడంలా మరిన్ని ముక్కలయ్యి ఎవరికి వారు బ్రతుకుతెరువుకి తలో దిక్కుకీ పోవడానికి సిద్ధమయ్యారు. వీరి మధ్యలో ఒక కుటుంబం. తల్లి అనంతమ్మ, తండ్రి అప్పయ్య, పిల్లాడు భరత్. నీకు ఈ గొడవలన్నీ ఎందుకు, పట్నమెళ్లి ఏదో పని చూసుకో నాయనా అని భరత్ కి తల్లితండ్రులు చెప్పడంతో ఒంటరి ప్రయాణం మొదలు పెట్టాడు. . భరత్ ఉత్తరం వైపు బయల్దేరాడు. ఒకటా రెండా 10 కోట్ల సంవత్సరాల పాటు గొప్ప సాహస యాత్ర చేసాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మొత్తానికి ఐదు కోట్ల ఏళ్ల క్రితం తీరం చేరాడు. అక్కడ ఒక పెద్దన్నని ఢీకొని దందా

కొన్ని సముద్రతీరాల్లో (బీచ్‌ల్లో) నల్లటి ఇసుక ఉంటుంది. ఎందుకు?

Image
  సాధారణంగా పెద్ద తుఫాన్లు సంభవించిన తరువాత లేదా సముద్రపు అలలు ఉధృతి ఎక్కువగా ఉన్న రోజుల్లో తీరం వెంబడి ఇసుక దట్టంగా నల్లని పొర లాగ పేరుకుపోయి ఉంటుంది. చిత్రం:  India to reopen mining for rare-earth elements | MRS Bulletin | Cambridge Core చిత్రం:  Heavy mineral sand ఈ నల్లని ఇసుక రేణువులు మామూలు ఇసుక రేణువుల కన్నా పరిమాణంలో చిన్నవిగా మరియు ఎక్కువ సాంద్రతను(>2.9g/cc) కలిగి ఉంటాయి. సముద్రం లోతున ఉండే ఇలమనైట్, గార్నెట్, టార్మలీన్, హార్న్ బ్లెండ్, సిలమనైట్, మోనోజైట్, రుటైల్ లాంటి భారీ ఖనిజ పదార్ధాలు(Heavy minerals) [1] తీరానికి కొట్టుకు రావడమే దీనికి కారణం. ఇసుక తో పోల్చుకుంటే సాంద్రత ఎక్కువగా ఉండటం చేత వీటి కదలికలకి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అందువల్ల కేవలం పెద్ద కెరటాలు లేదా ప్రవాహాల కారణంగా మాత్రమే తీరానికి కొట్టుకువచ్చి మెరుస్తూ మామూలు ఇసుక మధ్యలో నల్లని పొరలు లాగ ఏర్పడతాయి. ఈ ఇసుకని చేతులో పట్టుకుని చూస్తే భారంగా ఉంటుంది. పరిశ్రమల్లో ఈ ఖనిజాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సముద్ర కాలుష్యం ద్వారా ఇవి ఏర్పడవు. చిత్రం:  MRG Metals picks up high potential heavy mineral sands projects i

ఎవరెస్టు ఎత్తుల కొలతల్లో తేడాలు?

Image
ఎవరెస్టు ఎత్తుల కొలతల్లో హెచ్చుతగ్గులకి కారణాలు ఉన్నాయి. ఏది ఖచ్చితమైన కొలత అనేది కొలిచిన వారు అనుసరించిన పద్ధతులు, పరిగణలోకి తీసుకున్న విషయాలు, వారు ఉపయోగించిన సాంకేతికత మీద ఆధారపడి ఉంటుంది. పరికరాల ఖచ్చితత్వంలో ఉండే వ్యత్యాసాలు కాసేపు పక్కన పెట్టి ప్రాకృతిక కారణాలను అన్వేషిస్తే టెక్టానిక్ ఫలకల కదలికలు, భూకంపాలు, సముద్ర మట్టాన్ని సరిగా అంచనా వేయలేక పోవడంతో పాటు 'భూసమస్థితిక' (Isostasy) అనే మరొక ఆసక్తికరమైన కారణం కూడా ఉంది. పర్వత శిఖరాల ఎత్తును కొలవడానికి మొదట్లో 'థియోడలైట్' అనే పరికరాన్ని వాడేవారు. ఇది నిటారు కోణాల్ని(Vertical angles) కొలవడానికి ఉపయోగించే సాధనం. చిత్రం:  Old theodolite stock photo. Image of measure, exact, leveling - 9588854 ఈ పరికరంలో ఉండే టెలీస్కోపు ద్వారా పర్వతం యొక్క మూలస్థానం(Base) మరియు శిఖరం మొన(Summit)లని గమనించి, వాటి కోణాల్ని నమోదు చేసుకుంటారు. ఆ కోణాల నుండి చాలా సులభంగా త్రికోణమితి సూత్రాలనుపయోగించి పర్వతం యొక్క ఎత్తుని కనుక్కోవచ్చు. చిత్రం:  Measuring Height using Vertical Angle in Surveying h1 = D tan α1   h2 = D tan α2   పర్వతం ఎత్తు = h1