Posts

బెంగాల్ బేసిన్లో మొదలైన చమురు ఉత్పత్తి

Image
బెంగాల్ బేసిన్లో మొదలైన చమురు ఉత్పత్తి ఓఎన్జీసీ క్రితం ఆదివారం బెంగాల్ బేసిన్లో మొదటిసారిగా చమురు ఉత్పత్తి ప్రారంభించింది. కేంద్ర చమురు, సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో అసోకనగర్ -1 బావి నుండి చమురు ఉత్పత్తి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మన దేశంలోని చమురు, సహజ వాయువులు ఉత్పత్తి చేసే బేసిన్లలో బెంగాల్ బేసిన్ ఎనిమిదవదిగా నిలిచింది. https://www.google.com/amp/s/www.aninews.in/news/business/dharmendra-pradhan-dedicates-bengal-basin-to-nation-says-discovery-would-aid-indias-energy-security20201222145853%3famp=1 ముంబై ఆఫ్ షోర్, క్యాంబే, కృష్ణ -గోదావరి, రాజస్థాన్, అస్సాం-అరకన్, అస్సాం షెల్ఫ్, కావేరి బేసిన్లు ఇప్పటివరకు హైడ్రో కర్బన నిక్షేపాలను ఉత్పత్తి చేస్తుండగా, కొత్తగా బెంగాల్ బేసిన్ కూడా ఆ జాబితాలో చేరింది. శాస్త్రవేత్తల, ఇంజనీర్ల డెబ్భై ఏళ్ల కృషికి ఫలితంగా చమురు దిగుమతులను తగ్గించి, దేశ శక్తి భద్రతను కాపాడటంలో బెంగాల్ బేసిన్ కీలక పాత్ర పోషించనుంది. ఈ బేసిన్ యొక్క ఉత్పత్తి అంచనాలు పూర్తిగా బహిర్గతం కాకపోయినా, ఉత్పత్తి మాత్రం లాభదాయకమే...

గేట్ పరీక్ష

Image
మన దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో(PSU) ఉద్యోగాలకి, ఎంటెక్, పీహెచ్డీ ప్రవేశాలకు; విదేశాల్లో కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఎమ్మెస్ ప్రవేశాలకు GATE పరీక్షలో స్కోరును ప్రామాణికంగా తీసుకొని నేరుగా ప్రవేశాలు కల్పించడం లేదా మౌఖిక పరీక్షకు అర్హత కల్పించడం జరుగుతుంది. ఈ నియామకాల్లో ఆయా సంస్థల నిబంధనల దృష్ట్యా గేట్ స్కోరుకు 50-80 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు బీటెక్ అయిన తరువాత మంచి జీతంతో ఉద్యోగం, ప్రోత్సాహకాలు, స్థిరమైన జీవితం కోసం కాంక్షించే వారికి గేట్ ఒక మంచి ఎంపిక. ఈ పరీక్ష ఏడాదికొక్కసారి ఫిబ్రవరి మొదటి, రెండవ వారంలో జరుగుతుంది. ఐఐటీ, ఐఐఎస్సీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవాలని కలలుగనే వారు గేట్ పరీక్ష ద్వారా ఎం.టెక్ కోర్సులో ప్రవేశం పొంది, కోర్సు పూర్తి చేస్తూ ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యి భారీ ప్యాకేజీలు అందుకునే ఆస్కారం ఉంది. గేట్ ద్వారా ఎం.టెక్ లో చేరిన వారికి నెలవారీ 12,400 రూపాయలు ఉపకార వేతనం అందుతుండటంతో ముఖ్యంగా పేద, మధ్య తరగతి విద్యార్థులు తమ చదువుకు, స్వంత ఖర్చులకు పెద్దగా ఇంట్లో వారిపై ఆధారపడనవసరం లేదు. అంతేకాకుం...

సాలగ్రామాలు

Image
హిందూ దేవాలయాలలో ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తి ప్రతిరూపంగా పూజింపబడే ఒక రకమైన నల్లని రాళ్ళని సాలిగ్రామాలు/సాలగ్రామాలు అంటారు. ఇవి నేపాల్ లోని గండకీ నది పరీవాహక ప్రాంతమైన 'సాలిగ్రామం' అనే గ్రామం లో విరివిగా లభిస్తాయి. ఈ రాళ్ళు మృదువుగా అక్కడక్కడా కొన్ని గుర్తులతో అండాకారం లో ఉంటాయి. ఆ గుర్తులు విష్ణువు యొక్క ఆయుధాలని చెప్పబడే శంఖం,చక్రం, గదలను మరియు విష్ణువు అవతారాలైన మత్స్య,కూర్మావతారాలను తలపించే విధంగా ఉండటం వలన ఆ రాళ్ళకు దివ్య శక్తులున్నట్లు ప్రజలు విశ్వసిస్తారు. జియాలజీ పరంగా వాటిని 65 మిలియన్ సంవత్సరాల క్రితం (క్రెటేషియస్ శకం) అంతరించిపోయిన 'అమ్మో నైట్స్స్ ' అనే సముద్ర జీవజాతుల శిలాజ అవశేషాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. డైనొసార్లు అంతరించింది కూడా ఈ కాలంలోనే. ఆ ప్రదేశం వద్ద రెండు భూభాగాలను వేరు చేస్తూ మద్యలో 'తెథిస్' అనే సముద్రం ఉండేది. క్రమంగా ఆ భూభాగాలు రెండు దగ్గరికి జరిగి బలంగా ఢీకొని సముద్రపు నేల బయటకు చొచ్చుకువచ్చి నేటి హిమాలయాలుగా రూపాంతరం చెందాయి. ఈ సంఘటన వల్ల అక్కడ ఉన్న సముద్రం మొత్తం కప్పబడి, అందులో ఉన్న జీవజాతులన్నీ నేలలోకి...

భూమి కేంద్రం వరకూ డ్రిల్లింగ్ చెయ్యడం సాధ్యమేనా? శాస్త్రవేత్తలు భూఅంతర్భాగం గురించి ఏ విధంగా తెలుసుకుంటారు?

Image
భూమి పూర్తి వ్యాసార్ధం సుమారు 6400 కిలోమీటర్లు. ఇందులో ముఖ్యంగా భూపటలం (Crust) అనబడే భూమి పై పొర, ఖండాలపై 40–70 కిలోమీటర్లు మరియు సముద్రంలో 6–7 కిలోమీటర్ల మందంగా ఉంటుంది. ప్రస్తుతానికి మానవుడు చేరుకున్నది 40000 వేల అడుగులు (సుమారు 12 కిలోమీటర్లు) మాత్రమే. భూమి లోపలలికి అత్యంత లోతైన రంధ్రాలు: "కోలా సూపర్ డీప్ బోర్ హోల్" (రష్యా:1984) - 40230 అడుగులు "Z-44 చేవో వెల్" (రష్యా: 2008)- 40600 అడుగులు "BD-04A" ( కతర్-2008)-40318 అడుగులు. మన దేశం విషయానికి వస్తే ఓఎన్జీసీ కేజీ బేసిన్లో తవ్విన NA7–1 (10,385 అడుగులు: 3.16 కి.మీ) అనేది ఇప్పటి వరకూ లోతైన రంధ్రం. అంతరిక్షంలో లక్షల కిలోమీటర్ల దూరాలను చేరుకోగలిగిన మానవుడు, తనదైన గ్రహం అంతర్భాగంలో 0.18% మాత్రమే చేరుకోగలిగాడు. దానికి కారణం ఘనరూపంలో ఉన్న భూమిలోని పొరలు ఎంతో దృఢంగా ఉంటాయి. వీటిని వైజ్ణానికపరంగా అధ్యయనం చేయడానికి ఉన్న ఉత్తమ మార్గం డ్రిల్లింగ్. ఉదాహరణకు భూమి కేంద్రం వరకూ రంధ్రం చెయ్యాలనే ప్రయత్నం మొదలుపెట్టామనుకుందాం.. భూమి గుండా డ్రిల్లింగ్ చెయ్యడమనేది సాధారణ విషయం కాదు. ఎంతో ఖర్చు, భార...

భూకంపాలు ఏ విధంగా సంభవిస్తాయి? ఎక్కడ సంభవిస్తాయి? మన దేశంలో భూకంపాలు సంభవించే ప్రాంతాలు ఏమిటి?

Image
భూమి ఆవిర్భావం: కొన్ని విపత్కర పరిస్థితుల వల్లనో లేక పరిణామ పరిస్థితుల వల్లనో జరిగిన సంఘటనల ద్వారా సూర్యుడు, మరియు ఇతర గ్రహాలు ఏర్పడ్డాయి. ఇదంతా విశ్వంలో ఉన్న నక్షత్ర ధూళి, గురుత్వాకర్షణ ద్వారా దగ్గరికి చేరి గుండ్రంగా తిరుగుతూ, క్రమంగా పెద్దవిగా అయ్యి గ్రహాలుగా రూపాంతరంచెందాయి. ఈ విధంగా భూమి ఏర్పడి ఇప్పటికి 4.5 బిలియన్ సంవత్సరాలయింది. మొదట్లో భూమి ఒక మండుతున్న అగ్ని గోళంలా ఉండేది. భూమి మొత్తం శిలా ద్రవంతో నిండి, ఎక్కడ చూసినా పేలుళ్ళు, ఎగసి పడే వాయువులు, విపరీతమయిన వేడిమితో ఎంతో ప్రతికూలంగా ఉండేది. కొన్ని చర్యల వల్ల ఈ వాతావరణం క్రమంగా చల్లబడుతూ భూమి యొక్క పైపొర(Crust) గట్టిపడి 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఒకింత స్థిరమైన భూభాగం ఏర్పడింది. Crust గట్టిపడినా, లోపల వేడిమి అలానే ఉండిపోవడంచేత భూమి లోపలి పొరలు శిలాద్రవంలానే మిగిలిపోయాయి. భూమి లోపలికెళ్లేకొద్దీ ప్రతీ కిలోమీటరుకు సుమారు 25-29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఒకసారి భూమి అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం మనం ఉన్న Crust అనబడే భూమి పైపొర ఘన రూపంలో, దాని కింద Upper Mantle పాక్షిక ఘన రూపంలో, Lower mantl...